అత‌నికి జట్టులో చోటు దక్కకపోవడం దురదృష్టకరం

Sun,May 20, 2018 03:22 PM

Rishabh Pant reminds me of my younger days

న్యూఢిల్లీ: ఐపీఎల్-11లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. వ్యక్తిగతంగా అసాధారణ ప్రదర్శన చేశాడు యువ క్రికెటర్ రిషబ్ పంత్. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం. సూపర్ ఫామ్‌లో ఉన్న పంత్‌పై టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ నా ఫేవరెట్ ఆటగాడు అని పేర్కొన్నాడు. అతన్ని చూస్తుంటే కెరీర్ ఆరంభంలో తన బ్యాటింగ్ శైలి గుర్తుకొస్తుందంటూ రైనా చెప్పాడు.

అతడు చాలా బాగా ఆడుతున్నాడు. ప్రస్తుతానికి నా ఫేవరెట్ బ్యాట్స్‌మన్ అతడే. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా కలిస్తే.. రిషబ్ పంత్ అని సచిన్ టెండూల్కర్ పాజీ కూడా చెప్పాడు. సెహ్వాగ్ కూడా అతని ఆటతీరును మెచ్చుకున్నాడు. అలాంటి క్రికెటర్లు దేవుడిచ్చిన వరం. ఈ 10ఏళ్ల కాలంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. పంత్ లాంటి క్రికెటర్లకు మద్దతు ఎంతో అవసరం. అని రైనా పేర్కొన్నాడు. టీమిండియా తరఫున వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు అతను భారత జట్టుకు ఎంపిక కాకపోవడం దురదృష్టకరం అని రైనా వివరించాడు.

3592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles