పంత్ ఫెంటాస్టిక్ షో.. ముంబ‌యి ల‌క్ష్యం 175

Sun,May 20, 2018 06:12 PM

Rishabh Pant dazzles for DD; MI need 175 to advance to Playoffs

ఢిల్లీ: ఐపీఎల్-11లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ యువ కెరటం రిషబ్ పంత్(64: 44 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కట్టుదిట్టమైన ముంబయి బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ఆఖర్లో విజయ్ శంకర్(43 నాటౌట్: 30 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది.

ఓపెనర్ మాక్స్‌వెల్(22: 18 బంతుల్లో 4ఫోర్లు), అభిషేక్ శర్మ(15 నాటౌట్: 10 బంతుల్లో సిక్స్) అంతంతమాత్రంగానే పరుగులు రాబట్టారు. ముంబయి బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసినప్పటికీ ఢిల్లీ స్కోరును అడ్డుకోలేకపోయారు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ సమయోచితంగా ఆడి గౌరవప్రదమైన స్కోరు అందించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న‌ పంత్ మాత్రం కళ్లుచెదిరే షాట్లతో కళాత్మకంగా విధ్వంసం సృష్టించాడు. హడావుడికి పోకుండా కీలక సమయంలో నిదానంగా ఆడి ముంబయికి ఎదురు నిలిచాడు. కృనాల్ పాండ్య, బుమ్రా,మయాంక్ మర్కండే తలో వికెట్ తీశారు. బుమ్రా వేసిన 19వ ఓవర్ ఆఖరి బంతికి విజయ్ శంకర్ ఇచ్చిన క్యాచ్‌ని అందుకోబోయి ముంబయి సారథి రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు.

2260
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles