ఢిల్లీ ధనాధన్..బెంగళూరు టార్గెట్ 182

Sat,May 12, 2018 09:49 PM

Rishabh Pant, Abhishek Sharma propel DD to 181 for 4 vs RCB

ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ పోరాటపటిమ కనబర్చింది. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలినా మిగతా బ్యాట్స్‌మెన్ తలో చేయి వేయడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. యువ సంచలనం రిషబ్ పంత్(61: 34 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు), అభిషేక్ శర్మ(46: 19 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) విజృంభించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది.

తొలి ఓవర్‌లోనే భారీ దెబ్బతిన్న ఢిల్లీకి మూడో ఓవర్‌లో మరో షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో పృథ్వీ షా(2), మూడో ఓవర్‌లో జేసన్ రాయ్(12) వెనుదిరగడంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. ఈ దశలో క్రీజులో ఉన్న పంత్‌కు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(32: 35 బంతుల్లో 3ఫోర్లు) సహకారం అందించడంతో చెలరేగి ఆడాడు. బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగి మంచి పునాది వేశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ ఢిల్లీ పోరాట స్పూర్తిని కనబర్చి గొప్ప ప్రదర్శన చేశారు. ఆఖర్లో విజయ్ శంకర్(21), అభిషేక్ వేగంగా ఆడటంతో బెంగళూరుకు మంచి లక్ష్యాన్నే నిర్దేశించగలిగారు.

2743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS