ధోనీని మించిన రిషబ్ పంత్

Sun,December 16, 2018 05:33 PM

Rishab Pant overtakes MS Dhoni in the series against Australia

పెర్త్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఏకంగా 11 క్యాచ్‌లతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన పంత్.. రెండో టెస్ట్‌లో లెజెండరీ వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో షమి బౌలింగ్‌లో షాన్ మార్ష్ క్యాచ్ అందుకున్న పంత్.. ధోనీ, సాహా, కిర్మాణీలను వెనక్కి నెట్టాడు. ఈ సిరీస్‌లో అతనికిది 15వ క్యాచ్. ఈ క్రమంలో 14 క్యాచ్‌లతో గతంలో కిర్మాణీ, ధోనీ, సాహా పేరిట ఉన్న రికార్డును పంత్ అధిగమించాడు. కిర్మాణీ 11 క్యాచ్‌లు, మూడు స్టంపింగ్‌లు, ధోనీ 9 క్యాచ్‌లు, 5 స్టంపింగ్‌లు, సాహా 13 క్యాచ్‌లు ఒక స్టంపింగ్ చేయగా.. పంత్ మాత్రం మొత్తం 15 క్యాచ్‌లే అందుకోవడం విశేషం. ఇందులో తొలి టెస్ట్‌లోనే 11 క్యాచ్‌లు అందుకోగా.. రెండో టెస్ట్‌లో ఇప్పటివరకు 4 క్యాచ్‌లు అందుకున్నాడు.

7145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles