ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు టీమ్ ఎంపిక.. రిషబ్ పంత్‌కు చాన్స్

Wed,July 18, 2018 03:06 PM

Rishab Pant gets a chance in Indian test side for series against England

ముంబై: ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి మూడు టెస్టుల కోసం టీమ్‌ను ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తొలిసారి టెస్ట్ టీమ్‌లో చోటు కల్పించారు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్‌కు చాన్సిచ్చారు. దినేష్ కార్తీక్‌ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. ఇక బొటన వేలి గాయంతో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా టెస్ట్ టీమ్‌లో స్థానం దక్కింది. గాయం నుంచి కోలుకోగానే అతను టీమ్‌తో చేరనున్నాడు. ఇక యొ యొ టెస్ట్ పాసయిన పేస్ బౌలర్ మహ్మద్ షమిని కూడా ఎంపిక చేయడం విశేషం. బుమ్రాను టీమ్‌లోకి ఎంపిక చేసినా.. అతను రెండో టెస్ట్ నుంచి తుది జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే మరో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వెన్ను గాయం మరింత ఎక్కువైందని, టెస్టు టీమ్‌లోకి అతన్ని తీసుకోవాలా వద్ద అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని ఆ ప్రకటనలో బోర్డు చెప్పింది. ఆగ‌స్ట్ 1న ఎడ్‌బాస్ట‌న్‌లో ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మొద‌ల‌వుతుంది.


ఇంగ్లండ్‌తో టెస్ట్‌లకు టీమిండియా


కోహ్లి, ధావన్, రాహుల్, విజయ్, పుజారా, రహానే, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్

3383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles