పాకిస్థాన్ గెలిస్తేనే..!

Wed,June 26, 2019 02:02 PM

Rejuvenated Pakistan in battle for survival against New Zealand

బర్మింగ్‌హామ్‌: అనూహ్య విజయాలు, ప‌రాజ‌యాల‌తో మెగా టోర్నీ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఫేవ‌రెట్లుగా బ‌రిలో దిగిన జ‌ట్లు సెమీస్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకోగా..వెస్టిండీస్‌, సౌతాఫ్రికా ఇప్ప‌టికే రేసు నుంచి త‌ప్పుకున్నాయి. బుధ‌వారం మ‌రో ఆస‌క్తిక‌ర పోరు జ‌ర‌గ‌నుంది. అంతకుమించి పరాజయాలతో టోర్నీలో పడుతూ లేస్తూ సాగుతున్న పాకిస్థాన్.. వరుస విజయాలతో సాఫీగా సాగిపోతున్న న్యూజిలాండ్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. ఆరు మ్యాచ్‌లాడిన పాకిస్థాన్‌ రెండింటిలో గెల‌వగా.. మూడింటిలో ఓడింది. వ‌ర్షం కార‌ణంగా ఒక మ్యాచ్ ర‌ద్దుతో 5 పాయింట్ల‌తో ఏడో స్థానంలో ఉంది. మ‌రోవైపు పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉన్న కివీస్ ఇంకో మ్యాచ్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ బెర్త్‌ను పటిష్ఠం చేసుకోవాలని కివీస్ కోరుకుంటోంది. సెమీస్ అవ‌కాశాల‌ను స‌జీవంగా ఉంచుకోవాలంటే పాక్ త‌మ మిగ‌తా మ్యాచ్‌ల్లో త‌ప్ప‌క గెల‌వాల్సిందే. నిలకడ లేని ఆటతీరుతో సతమతమవుతున్న పాక్‌.. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న కివీస్‌ను ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరం.

2964
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles