జడేజాకు 'అర్జున'..దీపామాలిక్‌కు 'ఖేల్ రత్న'

Sat,August 17, 2019 06:08 PM

Ravindra Jadeja among 19 sportspersons nominated for Arjuna Award

న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ రవీంద్ర జడేజాకు అర్డున అవార్డు దక్కింది. జడేజాతో పాటు మరో 18 మందికి అర్జున పురస్కారాలను ప్రకటించారు. పారా అథ్లెట్ దీపా మాలిక్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం దక్కింది. పారాలింపిక్స్‌లో వెండి పతాకాన్ని గెల్చుకున్న భారత మొట్టమొదటి వనిత దీపామాలిక్. క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ, విశేష సేవలు అందించిన వారికి ప్రతీ ఏడాది ఈ అవార్డులను అందిస్తారు.

స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాను కూడా సెలక్షన్ కమిటీ ఖేల్త్న్రకు ఎంపిక చేసింది. క్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ తాజాగా ఆమోదం తెలిపింది. భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్(మహిళా క్రీడాకారిణి)ల పేర్లను అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది. ఈ మేరకు పురస్కారాల ఎంపిక కమిటీ వీళ్ల పేర్లను కేంద్ర క్రీడాశాఖకు సిఫారసు చేసింది. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు అవార్డులను అందజేస్తారు.

అవార్డులకు ఎంపికైంది వీళ్లే..

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు:

భజరంగ్ పూనియా-రెజ్లింగ్
దీపా మాలిక్- పారా అథ్లెటిక్స్

ద్రోణాచార్య

విమల్ కుమార్-బ్యాడ్మింటన్
సందీప్ గుప్తా-టేబుల్ టెన్నిస్
మోహిందర్ సింగ్- అథ్లెటిక్స్

లైఫ్‌టైం కేటగిరి..

కోచ్:
మెర్జ్‌బాన్ పటేల్-హాకీ
రంభీర్ సింగ్-కబడ్డీ
సంజయ్ భరద్వాజ్-క్రికెట్

అర్జున అవార్డు:
తజీందర్‌పాల్ సింగ్-అథ్లెటిక్స్
మొహమ్మద్ అనాస్-అథ్లెటిక్స్
ఎస్.భాస్కరన్-బాడీ బిల్డింగ్
సోనియా లాథర్-బాక్సింగ్
రవీంద్ర జడేజా-క్రికెట్
చింగ్లెన్‌సనా సింగ్-హాకీ
అజయ్ ఠాకూర్-కబడ్డీ
గౌరవ్ సింగ్ గిల్-మోటర్ స్పోర్ట్స్
ప్రమోద్ భగత్ పారా స్పోర్ట్స్(బ్యాడ్మింటన్)
అంజుమ్ ముద్గిల్-షూటింగ్
హర్మీత్ దేశాయ్-టేబుల్ టెన్నిస్
పూజా ధండే-రెజ్లింగ్
ఫౌద్ మీర్జా-ఈక్వెస్ట్రియన్
గుర్‌ప్రీత్ సింగ్ సంధు-ఫుట్‌బాల్
పూనమ్ యాదవ్-క్రికెట్
స్వప్న బర్మాన్-అథ్లెటిక్స్
సుందర్ సింగ్-పారా స్పోర్ట్స్
బమ్మిడిపాటి సాయి ప్రణీత్-బ్యాడ్మింటన్
సిమ్రాన్ సింగ్-పోలో

ధ్యాన్‌చంద్ అవార్డ్:

మాన్యువల్ ఫ్రెడ్రిక్స్-హాకీ
అరుప్ బసక్-టేబుల్ టెన్నిస్
మనోజ్ కుమార్-రెజ్లింగ్
నిట్టెన్ కీర్తనె-టెన్నిస్
లాల్రెంసంగా- ఆర్చరీ

1543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles