రవిశాస్త్రి జీతం.. ఏడాదికి ప‌ది కోట్లు

Mon,September 9, 2019 03:20 PM

Ravi Shastri Set to Get a Massive Salary Hike in New Contract

హైద‌రాబాద్‌: టీమిండియా క్రికెట్ హెడ్‌కోచ్ ర‌విశాస్త్రీ జీతం పెర‌గ‌నున్న‌ది. సుమారు 20 శాతం మేర జీతం పెర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. అత‌ని జీతం ఏడాదికి సుమారు 9.5 నుంచి 10 కోట్ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు ఓ ప‌త్రిక వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు శాస్త్రి వార్షిక ఆదాయం 8 కోట్లుగా ఉంది. టీమిండియా స‌పోర్ట్ స్టాఫ్‌కు కూడా జీతాలు పెంచ‌నున్నారు. భ‌ర‌త్ అరున్‌కు 3.5 కోట్లు, విక్ర‌మ్ రాథోడ్‌కు 3 కోట్ల వ‌ర‌కు ఇవ్వ‌నున్నారు. ఇటీవ‌లే ప్ర‌ధాన కోచ్‌గా ర‌విశాస్త్రికి రెండేళ్ల పొడిగింపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. టీమ్‌ నిల‌క‌డ‌గా రాణించే విధంగా చూస్తూ.. యువ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డ‌మే త‌న ముందున్న క‌ర్త‌వ్యం అని శాస్త్రి తెలిపాడు. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌, 2020లో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌పై దృష్టిపెట్టిన‌ట్లు చెప్పాడు.

1201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles