టీమిండియా కోచ్‌.. షార్ట్‌లిస్టులో ఆరుగురు

Tue,August 13, 2019 08:47 AM

Ravi Shastri among six candidates shortlisted for Indias coach job


హైద‌రాబాద్‌: టీమిండియా క్రికెట్ కోచ్ ప‌ద‌వి కోసం బీసీసీఐ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుత కోచ్ ర‌విశాస్త్రితో పాటు మొత్తం ఆరు మందిని సెల‌క్ష‌న్ క‌మిటీ షార్ట్ లిస్టు చేసింది. ఆ జాబితాలో భార‌త్‌కు చెందిన లాల్‌చంద్ రాజ్‌పుత్‌, రాబిన్ సింగ్‌ల‌తో పాటు మాజీ కివీస్ కోచ్ మైక్ హెస్సాన్‌, మాజీ శ్రీలంక కోచ్ లామ్ మూడీ, మాజీ ఆఫ్ఘ‌నిస్తాన్ కోచ్ ఫిల్ జోన్స్‌లు ఉన్నారు. క‌పిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ (సీఏసీ) ముందు తుది ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకానున్నారు. ఈ వారం చివ‌ర‌లోగా లేదా వ‌చ్చే వారం కొత్త కోచ్ ఎవ‌ర‌న్నది తేలుతుంది. ప్ర‌స్తుతం ర‌విశాస్త్రికి 45 రోజుల పొడిగింపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఆరుగురు షార్ట్‌లిస్టులో ఉన్నా.. విండీస్‌కు చెందిన ఫిల్ సిమ్మ‌న్స్ కూడా హెడ్ కోచ్ ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

1216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles