ఐఎస్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడిగా రణీందర్ సింగ్

Sun,December 2, 2018 07:51 AM

Raninder Singh is the ISSF Vice President

న్యూఢిల్లీ: భారత షూటింగ్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు రణీందర్ సింగ్... అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దీంతో భారత్ నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి వ్యక్తిగా అతను అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ సాధారణ సర్వసభ్య సమావేశంలో మొత్తం నలుగురు ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. ఇందులో 51 ఏండ్ల రణీందర్‌కు 161 ఓట్లు రాగా, కెవిన్ కిట్టీ (ఐర్లాండ్)కి 162, రాబెర్ట్ మిచెల్ (అమెరికా)కు 153, వాంగ్ యిఫు (చైనా)కు 153 ఓట్లు వచ్చాయి. ఇది దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రణీందర్ సంతోషం వ్యక్తం చేశాడు. గతేడాది ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడిగా తిరిగిన ఎన్నికైన రణీందర్.. 2014లోనే ఓ సభ్యుడిగా గ్లోబల్ బాడీలోకి అడుగుపెట్టాడు.

700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles