ఇంగ్లాండ్‌లో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ అకాడమీ

Tue,March 19, 2019 02:29 PM

Rajasthan Royals launches cricket academy in UK

లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ ఇంగ్లాండ్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. సర్రేలోని రీడ్స్ స్కూల్‌లో ఉన్న స్టార్ క్రికెట్ అకాడమీతో రాజస్థాన్ చేతులు కలిపింది. అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్ది రాజస్థాన్ రాయల్స్ అకాడమీగా పేరు మార్చారు. ఈ ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ సెంటర్‌ను మాజీ బ్యాట్స్‌మన్ సిద్ధార్థ్ లాహిరీ నిర్వహిస్తున్నారు. అతనితో పాటు అంతర్జాతీయ కోచ్‌లు, మెంటార్ల పర్యవేక్షణలో అకాడమీలో ఉన్న యువ క్రికెటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. రాజస్థాన్ రాయల్స్ అకాడమీని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని అకాడమీ నిర్వాహకులు తెలిపారు.

1236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles