ఢిల్లీపై బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Sat,May 4, 2019 03:48 PM

Rajasthan Royals have won the toss and have opted to bat

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12 సీజన్‌లో లీగ్‌ దశ తుది అంకానికి చేరుకుంది. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ రహానె బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఢిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో విజ‌యం ద్వారా టాప్-2లో చోటు దక్కించుకోవాలని భావిస్తోంది. రెండు జట్లకీ ఇదే లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌కాగా. . ఒకవేళ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడితే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ప్ర‌స్తుతం 11 పాయింట్ల‌తో రాజ‌స్థాన్ ఆరో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు అర్హ‌త సాధించే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ సీజన్‌ను ఘ‌నంగా ముగించాల‌ని రాజ‌స్థాన్ ప‌ట్టుద‌ల‌గా ఉంది.


1049
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles