World Cup: వర్షం అంతరాయం..నిలిచిన మ్యాచ్‌

Mon,June 10, 2019 04:07 PM

Rain stops play

సౌతాంప్టన్: వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ ఆరంభమైన 7 ఓవర్ల తర్వాత అకస్మాత్తుగా చిరుజల్లులు రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 7.3 ఓవర్లలో రెండు వికెట్లకు 29 రన్స్ చేసింది. జోష్‌లో ఉన్న కరీబియన్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు. డికాక్(17), డుప్లెసిస్(0) క్రీజులో ఉన్నారు.

3097
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles