భారత్, విండీస్ రెండో వన్డేకూ.. అడ్డంకిగా మారనున్న వరుణుడు..?

Sat,August 10, 2019 04:59 PM

rain might effect west indies and india second one day also

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య గయానాలో జరగాల్సిన మొదటి వన్డేకు వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్‌లో ఒక వన్డే వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. కాగా రేపు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారనుందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ జరిగే స్టేడియం పరిసరాల్లో ఉదయం, మధ్యాహ్నం కొంత సేపు వర్షం పడే అవకాశాలున్నాయని సమాచారం. అదే జరిగితే రెండో మ్యాచ్ కూడా రద్దవుతుందేమోనని అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్‌లో కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరో వైపు విండీస్ వన్డే సిరీస్‌నైనా చేజిక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles