టాస్ కూడా పడకుండానే తొలి రోజు ఆట రద్దు!

Wed,November 28, 2018 12:37 PM

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్ట్ సిరీస్‌కు ముందు ఏర్పాటు చేసిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా రద్దయింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ వేసే అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో టీమిండియా ప్లేయర్స్ జిమ్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్ కోహ్లితోపాటు ఇషాంత్ శర్మ, మురళీ విజయ్ జిమ్‌లో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. వర్షం ఆగేలా లేదు.. దీంతో ఇలా జిమ్‌కు వచ్చామంటూ విరాట్ ఈ ఫొటోను షేర్ చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత తొలి టెస్ట్ కోసం అడిలైడ్‌కు వెళ్తుంది. డిసెంబర్ 6 నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ కోసం ఇషాంత్, విజయ్‌లాంటి ప్లేయర్స్ టీమ్‌తో కలిశారు. ఓవైపు టీ20 సిరీస్ జరుగుతున్న సమయంలోనే మరోవైపు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ సిడ్నీ వెళ్లి టెస్టు స్పెషలిస్టులు మురళీ విజయ్, పృథ్వీ షా, రహానేతోపాటు పేస్ బౌలర్లు ఇషాంత్‌శర్మ, మహ్మద్ షమిలతో ప్రాక్టీస్ చేయించాడు.

2738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles