వర్షం అంతరాయం..భారత్ స్కోరు 305

Sun,June 16, 2019 06:23 PM

Rain halts play after India cross 300

మాంచెస్టర్: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. హిట్‌మ్యాన్ రోహిత్ అద్వితీయ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు చేసింది. రోహిత్(140: 113 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు) శతకంతో అలరించగా.. లోకేశ్ రాహుల్(57: 78 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకంతో విజృంభించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపుతున్నాడు. 47వ ఓవర్‌లో అకస్మాత్తుగా వర్షం రావడంతో మ్యాచ్‌ను అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం 46.4 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి భారత్ 305 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(71), విజయ్ శంకర్(3) క్రీజులో ఉన్నారు. రోహిత్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య(26 19 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్) ఉన్నంతసేపు రెచ్చిపోయాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన ధోనీ(1) ఆమిర్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న రెండో బంతికే వెనుదిరిగాడు. పాక్ బౌలర్లలో ఆమిర్ రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ తీశారు.


3582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles