రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం.. వీడియో

Thu,November 1, 2018 02:09 PM

తిరువనంతపురం: టీమిండియా లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదో భారత ప్లేయర్‌గా ద్రవిడ్ నిలిచాడు. గురువారం ఇండియా, వెస్టిండీస్ మధ్య ఐదో వన్డే ప్రారంభమయ్యే ముందు మరో లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ద్రవిడ్ జ్ఞాపిక అందుకున్నాడు. ద్రవిడ్ కంటే ముందు కేవలం నలుగురు భారత క్రికెటర్లకు మాత్రమే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఇంతకుముందు గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు మాత్రమే ఈ గౌరవం దక్కించుకున్నారు. గవాస్కర్, బేడీ, కపిల్ దేవ్‌లకు 2009లో, కుంబ్లేకు 2015లో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. భారత్ తరఫున ద్రవిడ్ 164 టెస్టులు, 344 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 13288, వన్డేల్లో 10889 పరుగులు చేశాడు. టెస్టుల్లో 36, వన్డేల్లో 12 సెంచరీలు చేశాడు. 2004లో అతడు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు.


2517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles