ఓటేసిన మాజీ క్రికెట్ దిగ్గజాలు

Sat,May 12, 2018 04:36 PM

Rahul Dravid, Anil Kumble cast vote in Karnataka Elections 2018

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు, కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలు తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌ల వద్దకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు ద్రవిడ్‌ను కర్ణాటక రాష్ట్ర ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాము ఓటు వేసిన విషయాన్ని రాహుల్, కుంబ్లే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.


1943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles