19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు విజయం దూరంలో..

Sun,September 8, 2019 10:27 PM

Rafael Nadal is bidding for his 19th Grand Slam title

న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు కేవలం ఒక్క విజయం దూరంలో నిలిచాడు. అర్ధరాత్రి 1.30 నుంచి పురుషుల సింగిల్స్ తుదిపోరు జరుగుతుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ రాత్రి జరిగే ఫైనల్ ఫైట్‌లో ఐదో సీడ్ మెద్వెదేవ్(రష్యా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ నాదల్ తనకు తిరుగులేని రీతిలో దూసుకెళుతున్నాడు. టోర్నీ మొత్తమ్మీద ఒక్క సెట్ మాత్రమే కోల్పోయాడంటే రఫా విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఫైనల్లో గెలిచి ఫెదరర్(20) తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన రికార్డుకు మరింత చేరువ కావాలని ఈ స్పెయిన్ స్టార్ కసితో కనిపిస్తున్నాడు.

తొలిసారి ఫైనల్లో..

టెన్నిస్‌కు జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నా అని రెండేళ్ల కిందట చెప్పిన డేనిల్ మెద్వదెవ్ అందుకు అనుగుణంగా మెరుగుపడుతూ 100కు పైగా ఉన్న ర్యాంకు నుంచి ప్రస్తుతం ఐదో స్థానానికి చేరాడు. అలాగే యూఎస్ ఓపెన్లో ఫైనల్ చేరి.. కలల గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు.

ఫైనల్‌ రాత్రి గం.1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–లో ప్రత్యక్ష ప్రసారం..

500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles