భారత్ బౌలర్ల జోరు.. అఫ్గాన్ ఆగమాగం

Tue,September 25, 2018 06:31 PM

Quick wickets jolt Afghanistan innings

అబుదాబి: ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. ఆరంభంలో ఓపెనర్ మహ్మద్ షెజాద్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో అఫ్గాన్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. పవర్ ప్లేలో పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ షెజాద్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఈ దశలో ఈ మ్యాచ్‌కు సారథిగా వ్యవహరిస్తున్న ధోనీ.. స్పిన్నర్ జడేజాను రంగంలోకి దించాడు. గింగిరాలు తిరిగే బంతులు వేస్తూ వికెట్ల ఖాతా తెరిచాడు. మరో ఎండ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న ఓపెనర్ జావెద్ అహ్మదీ.. జడ్డూ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ఆ తరువాత వచ్చిన రహ్మత్ షాను బౌల్డ్ చేసి అదరగొట్టాడు. వికెట్లు పడుతున్నప్పటికీ షెజాద్ మాత్రం తన జోరు తగ్గించలేదు. ఐతే చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. 16వ ఓవర్ రెండో బంతికి షాహిదీ.. మూడో బంతికి అస్గర్ అఫ్గాన్‌లను కనీసం ఒక్క పరుగు కూడా చేయనీకుండానే డ్రెస్సింగ్ రూమ్ పంపాడు. 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి అఫ్గాన్ 89 పరుగులు చేసింది. షెజాద్(75) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ రెండు సూపర్ స్టంపింగ్‌లతో అలరించాడు.

3580
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles