చరిత్ర సృష్టించిన సింధు

Sun,December 16, 2018 12:00 PM

PV Sindhu wins her maiden BWF World Tour Finals

గ్వాంగ్జౌ: హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. తన కెరీర్‌లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ ఒకుహరపై 21-19, 21-17 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ గంటా రెండు నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలతో అలరించింది. గతేడాది ఫైనల్ చేరినా సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్న సింధు.. ఈసారి మాత్రం టైటిల్ గెలవడం విశేషం. ఈ ఏడాది మొదటి నుంచీ సింధు టాప్ ఫామ్‌లో ఉంది. యమగుచి, తై జు యింగ్, రచనోక్‌లాంటి టాప్ ప్లేయర్స్‌పై వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన సింధు.. చివరి మ్యాచ్‌లోనూ అదే రేంజ్‌లో చెలరేగింది.


2445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles