సెమీస్‌లో సింధు..చరిత్ర సృష్టించిన ప్రణీత్‌

Fri,August 23, 2019 07:39 PM

PV Sindhu, Sai Praneeth keep Indias medal hunt alive

బాసెల్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ 2019లో భారత షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్‌ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పోరులో వీరిద్దరు తమ ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు 12-21, 23-21, 21-19 మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌, క్వార్టర్స్‌లో రెండో సీడ్‌, చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యుంగ్‌ను ఓడించింది. ఆరంభంలో నిదానంగా ఆడిన సింధు ప్రత్యర్థి దూకుడు ముందు తేలిపోవడంతో తొలి గేమ్‌ను 9 పాయింట్ల తేడాతో చేజార్చుకుంది. రేసులో ఉండాలంటే సింధు రెండో గేమ్‌ను తప్పక గెలవాల్సి ఉంది. ఈ తరుణంలో గట్టిగా పుంజుకున్న సింధు స్వల్ప తేడాతో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాక మూడో గేమ్‌ ఆరంభం నుంచే తైజు ఆధిపత్యం కొనసాగింది. గేమ్‌ మధ్యలో పుంజుకున్న సింధు మళ్లీ తన మునుపటి ఆటను ప్రదర్శించింది. ఆఖరి గేమ్‌ ఆద్యంతం అద్భుతంగా ఆడిన సింధు 21-19 తేడాతో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

మరో మ్యాచ్‌లో భారత స్టార్‌ షట్లర్‌, వరల్డ్‌ నంబర్‌ 19 సాయి ప్రణీత్‌ కూడా సెమీస్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రణీత్‌ 24-22, 21-14 తేడాతో ప్రపంచ నంబర్‌ 4, ఇండోనేషియా క్రీడాకారుడు జొనాథన్‌ క్రిష్టీపై గెలుపొందాడు. తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చిన జొనాథన్‌ రెండో గేమ్‌లో ప్రణీత్‌ జోరు ముందు నిలువలేకపోయాడు. పురుషుల సింగిల్స్‌లో 36ఏండ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌సిప్‌ పతకాన్ని కైవసం చేసుకోబోతున్న భారత క్రీడాకారుడిగా ప్రణీత్‌ చరిత్ర సృష్టించాడు. గతంలో 1983లో ప్రకాశ్‌ పదుకొనె ఈ మెగా ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు.

1232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles