స్వర్ణ పతకం తీసుకుంటున్నప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యా!

Tue,August 27, 2019 09:32 PM

PV Sindhu, Pullela Gopichand Press Meet in hyd

హైదరాబాద్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడం కోసం ఎంతో నిరీక్షించానని వరల్డ్‌ ఛాంపియన్‌, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అన్నారు. మంగళవారం రాత్రి గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 'ఛాంపియన్‌షిప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాల తర్వాత స్వర్ణం కల సాకారమైంది. ఎంతో నిరీక్షణ తర్వాత బంగారు పతకం సాధించా. గతంలో సెమీస్‌లో ఓడిపోయినప్పుడు సమీక్ష చేసుకున్నా. నేను స్వర్ణం గెలవాలని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. ప్రతిసారి ఒకే రకమైన గేమ్‌ ప్లాన్‌ పనిచేయదు. ఓడిపోయిన ప్రతిసారి మనల్ని మనం సమీక్ష చేసుకుని ముందుకెళ్లాలి. ఫైనల్‌ మ్యాచ్‌ కూడా మిగతా మ్యాచ్‌ల్లాగానే ఆడాలనుకున్నా. పైనల్‌ మ్యాచ్‌లో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. స్వర్ణ పతకం తీసుకుంటున్నప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యానని' అన్నారు.

కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ.. 'పతకాలు సాధించిన సింధు, సాయి ప్రణీత్‌కు అభినందనలు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సాధించాలనే నా కలను సింధు నిజం చేసింది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం లక్ష్యంగా సింధు సిద్ధమవుతోంది. గత ఒలింపిక్స్‌ చివరి మెట్టుపై సింధు కాస్త తడబడింది. సింధు 2020 విజన్‌తో ముందుకెళ్తోంది. క్రీడాకారులకు మంచి కోచింగ్‌ ఇస్తున్నామని' పేర్కొన్నారు.

740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles