అశ్విన్, పుజారా.. హ్యాండ్‌బ్రేక్ వేసిన కార్లలా పరుగెత్తారు!

Thu,December 7, 2017 12:33 PM

Pujara looks like a car that runs with a handbrake on says Gavaskar

న్యూఢిల్లీ: టీమిండియాలో విరాట్ కోహ్లి, జడేజాలాంటి మెరుపు ఫీల్డర్లు ఉన్నట్లే.. ఫీల్డింగ్ అంటేనే బద్ధకంగా ఉండే ప్లేయర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా టెస్టుల్లో పుజారా, అశ్విన్ ఇదే కేటగిరీకి చెందినవాళ్లు. శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్‌లో కీలకమైన సమయంలో క్యాచ్‌లు డ్రాప్ కావడం కూడా మ్యాచ్ డ్రా కావడానికి ఓ కారణమని తెలిసిందే. ఇదే విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తంచేశాడు. అశ్విన్, పుజారాలకు చురకలంటించాడు. మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరి గురించి కామెంట్ చేస్తూ.. పుజారా పరుగెత్తడం చూస్తుంటే హ్యాండ్ బ్రేక్ వేసిన కారు నడుస్తున్నట్లే ఉందని సన్నీ అన్నాడు. ఇక అశ్విన్ గురించి మాట్లాడుతూ.. అతను పరుగెత్తాలని అనుకుంటున్నాడు.. కానీ ముందుకు కదలలేకపోతున్నాడు అని అతను కామెంట్ చేశాడు. వీళ్లద్దరూ ఫీల్డ్‌లో చాలా భారంగా కదులుతున్నారు. స్లిప్స్‌లో ఉండే ఫీల్డర్లు చాలా వేగంగా కదలాల్సి ఉంటుంది. కానీ పుజారా మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు. అతను అంత వేగంగా అటు ఇటూ కదల్లేకపోతున్నాడు.

2838
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS