పొట్టి క్రికెట్లో వాళ్లేంటో ఇప్పటికే నిరూపించారు: రహానె

Tue,June 12, 2018 03:10 PM

Privilege to Play Afghanistan in Their First Test, Says Rahane


దుబాయ్: అఫ్గనిస్థాన్‌తో చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కు సారథ్యం వహించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని టీమిండియా తాత్కాలిక టెస్టు కెప్టెన్ ఆజింక్య రహానె అన్నాడు. అఫ్గాన్ ఆటగాళ్లకు చిరస్మరణీయ అనుభూతి కలిగించే టెస్టు ఇది. ఈ గొప్ప వేడుకలో తాము కూడా భాగం అవుతుండటం తమకు లభించిన సువర్ణావకాశమని రహానె వ్యాఖ్యానించాడు.

పొట్టి క్రికెట్లో వారి సత్తా ఏంటో నిరూపించారని రహానె అన్నాడు. వాళ్ల(అఫ్గాన్) టీమ్ చాలా బాగుంది. కొంతమంది ప్రతిభావంతులు ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తాచాటి వాళ్లేంటో నిరూపించారు. టెస్టు క్రికెట్‌లోనూ ఆ జట్టు ఇదే ప్రదర్శనను కొనసాగిస్తుందని కచ్చితంగా చెప్పగలను. భారత జట్టు తరఫున వాళ్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నా అని రహానె పేర్కొన్నాడు. భారత్, అఫ్గాన్ మధ్య బెంగళూరులో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ జూన్ 14న ఆరంభంకానుంది.

2783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles