పృథ్వీ షా, పుజారా హాఫ్ సెంచరీలు..

Thu,October 4, 2018 11:43 AM

Prithvi Shaw, Pujara scores half centuries against West Indies at Rajkot test

రాజ్‌కోట్ : వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ జోరుమీదున్నారు. ఇవాళ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. భోజన విరామ సమయానికి వికెట్ నష్టానికి 133 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. షా 75, పుజారా 56 రన్స్‌తో క్రీజ్‌లోనే ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మొదట్లోనే షాక్ తగిలింది. మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ రాహుల్ డకౌటయ్యాడు. అయితే ఆ తర్వాత రెండవ వికెట్ కోసం షా, పుజారాలు ధీటుగా ఆడారు. మొదటి టెస్టు ఆడుతున్న షా మాత్రం బౌండరీలతో తన స్కోర్‌ను పరుగెత్తించాడు.

1405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles