టీమిండియాకు మరో షాక్.. సిరీస్ మొత్తానికి పృథ్వీ షా దూరం

Mon,December 17, 2018 05:53 PM

ముంబై: రెండో టెస్ట్‌లో ఓటమి అంచున ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా మడమ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ పృథ్వీ షా గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా రెండు టెస్టులకు అతను దూరమయ్యాడు. అయితే రెండో టెస్ట్‌కు ముందు అతను జాగింగ్ చేస్తుండటంతో కనీసం మూడో టెస్ట్ నాటికి కోలుకుంటాడని అనుకున్నారు. కానీ ఆ సమయానికి కూడా అతను ఫిట్‌గా ఉండే అవకాశం లేకపోవడంతో ఇండియాకు పంపించేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు టెస్టుల్లో ఓపెనర్లుగా వస్తున్న మురళీ విజయ్, కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశపరిచారు. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్ ఆస్ట్రేలియా ైఫ్లెటెక్కనున్నాడు. అటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా మూడో టెస్ట్ తర్వాత టీమ్‌తో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను ఇప్పటికే ఫిట్‌నెస్ ప్రూవ్ చేసుకున్నాడు.

3874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles