చెన్నై vs పంజాబ్: ప్రీతీ జింతా కళ్లలో ఆనందం చూశారా?

Mon,April 16, 2018 05:54 PM

Pretty Preity Zinta Bonds With The Boys Yuvi-Gayleమొహాలి: గత సీజన్లలో పేలవంగా సీజన్‌ను ఆరంభించే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐపీఎల్-11లో మాత్రం ఆధిపత్యం చెలాయిస్తోంది. జట్టు అన్ని రంగాల్లో పటిష్ఠంగా ఉండటంతో బలమైన ప్రత్యర్థి జట్లపై విజయం సాధిస్తోంది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో పోరులో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది. వేలంలో నిరాధారణకు గురైన క్రిస్‌గేల్‌ను పంజాబ్ కొనుగోలు చేయడానికి కారణం ప్రీతి జింతానే. ఆఖరి రౌండ్లలో యువరాజ్‌సింగ్‌తో పాటు క్రిస్‌గేల్‌పై నమ్మకంతో యాజమాన్యాన్ని ఒప్పించి సాహాసోపేత నిర్ణయం తీసుకుంది ఆమెనే.

పంజాబ్ మేనేజ్‌మెంట్ ఉంచిన నమ్మకాన్ని యూనివర్స్ బాస్ వమ్ముచేయలేదు. తాను ఏరికోరి ఎంచుకున్న సుడిగేల్ క్రిస్‌గేల్ బ్యాట్‌తో సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే.. గ్యాలరీలో ఉన్న బాలీవుడ్ నటి, పంజాబ్ సహ యాజమాని ప్రీతి జింతా తెగ సంబరపడిపోయింది. గేల్ బ్యాట్‌తో ఆకాశమే హద్దుగా వీరవిహారం సృష్టిస్తున్నంత సేపు గ్యాలరీలో నిలబడి ఎగిరిగంతులేసింది. అభిమానులు, ఆటగాళ్లకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచింది. మ్యాచ్ అనంతరం గేల్‌ను హగ్ చేసుకొని అభినందనలు తెలిపింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన మరికొన్ని ఫొటోలు చూడండి.3937
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS