పోర్చుగ‌ల్ ఔట్‌.. ఉరుగ్వే స్ట‌న్నింగ్ విక్ట‌రీ

Sun,July 1, 2018 08:04 AM

Portugal out of worldcup, Uruguay enters quarter final

మాస్కో:యురోపియ‌న్ చాంపియ‌న్స్ పోర్చుగ‌ల్‌కు షాకిచ్చింది ఉరుగ్వే. ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించింది. శ‌నివారం జ‌రిగిన నాకౌట్ మ్యాచ్‌లో పోర్చుగ‌ల్‌పై 2-1 గోల్స్ తేడాతో ఉరుగ్వే నెగ్గింది. క్వార్ట‌ర్స్‌లో ఫ్రాన్స్‌తో ఉరుగ్వే త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఉరుగ్వే ప్లేయ‌ర్ ఎడిస‌న్ క‌వానీ రెండు గోల్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ ఓట‌మితో వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో క్రిస్టియానో రోనాల్డో షో ముగిసింది. గ్రూప్ స్టేజ్‌లో నాలుగు గోల్స్ చేసి పోర్చుగ‌ల్‌ను ముందుకు న‌డిపించిన రోనాల్డో.. కీల‌కమైన నాకౌట్ మ్యాచ్‌లో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. ఆట ఏడవ నిమిషంలోనే హెడ‌ర్ గోల్ చేశాడు క‌వానీ. ఆ త‌ర్వాత ఫ‌స్ట్ హాఫ్‌లో రెండు జ‌ట్లు అటాకింగ్ గేమ్ ఆడాయి. కానీ మ‌ళ్లీ గోల్స్ ద‌క్క‌లేదు. ఇక సెకండ్ హాఫ్‌లో పోర్చుగ‌ల్ ప్లేయ‌ర్ పెప్పి 55వ నిమిషంలో గోల్ చేశాడు. ఉరుగ్వే ప్లేయ‌ర్ క‌వానీ ఈ మ్యాచ్‌లో మ‌రోసారి త‌న స‌త్తా చాటాడు. ఆట 62వ నిమిషంలో స్ట‌న్నింగ్ గోల్ చేశాడు. దీంతో రోనాల్డో టీమ్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. శుక్ర‌వారం ఫ్రాన్స్‌, ఉరుగ్వే మ‌ధ్య క్వార్ట‌ర్స్ మ్యాచ్‌ జ‌రుగుతుంది.

పోర్చుగ‌ల్‌, ఉరుగ్వే మ్యాచ్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS