ఫిఫా: పోర్చుగల్ స్టార్ రొనాల్డో గెలిపించాడు

Wed,June 20, 2018 07:31 PM

Portugal beat Morocco 1-0

మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో మరోసారి మెరుపు ప్రదర్శన చేశాడు. గ్రూప్-బిలో భాగంగా మొరాకోతో మ్యాచ్ ఆరంభమైన నాలుగు నిమిషాలకే గోల్ కొట్టి అదరగొట్టాడు. తనదైన శైలిలో హెడర్ గోల్‌తో పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. రొనాల్డో వేగాన్ని చూసి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆశ్చర్యపోయారు. తరువాత తేరుకున్న మొరాకో గట్టిగానే పుంజుకుంది. రెండు జట్లు గోల్‌పోస్ట్‌లపై ఎటాకింగ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రథమార్థంలో రెండు టీమ్‌లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు పోరాడాయి. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న పోర్చుగల్ 1-0గోల్‌తో విజయం సాధించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్‌తో ఇరాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన మొరాకోకు మరోసారి నిరాశ తప్పలేదు.ద్వితీయార్థంలోనూ గోల్స్ కోసం రెండు జట్లూ గట్టిగానే ప్రయత్నించాయి. ఒకరిని ఒకరు తోసుకోవడాలు ఈ మ్యాచ్‌లు ఎక్కువ జరిగాయి. ఎల్లో కార్డు అందుకున్నాడు. మ్యాచ్ మొత్తం మీద మొరాకోపై పోర్చుగల్‌దే పైచేయిగా కనిపించింది. బంతిని ఎక్కువ సేపు నియంత్రణలో ఉంచుకునేందుకు రెండు జట్లు పోటీపడ్డాయి. పదేపదే గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. పోర్చుగల్ ఆధిపత్యాన్ని ధాటిగా ఎదుర్కొనేందుకు మొరాకో కూడా ఆరంభం నుంచే చక్కటి సమన్వయంతో ఆడడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. తొలి గోల్ అనంతరం రెండు జట్ల గోల్‌కీపర్లు చాకచక్యంగా వ్యవహరించి గోల్ ప్రయత్నాలను అడ్డుకున్నారు. స్కోరు సమం చేసేందుకు మొరాకో.. ఆధిక్యాన్ని పెంచేందుకు పోర్చుగల్ చెమటోడ్చాయి. ఆఖర్లో ఇంజురీ సమయంలో ఇరు జట్ల క్రీడాకారులు వాగ్వివాదానికి దిగడంతో రిఫరీ కల్పించుకొని వారించాడు.

1777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles