ట్విట్టర్‌కు సచిన్ రిక్వెస్ట్

Tue,October 17, 2017 12:41 PM

Please delete Arjun and Saras Fake accounts sachin requests Twitter

ముంబై: సెలబ్రిటీలు, వాళ్ల పిల్లలకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అన్నే ఇబ్బందులు కూడా ఉంటాయి. సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న ఈ రోజుల్లో ఫేక్ అకౌంట్లు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారాయి. తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు కూడా అదే సమస్య ఎదురైంది. మాస్టర్ ఇద్దరు పిల్లలు అర్జున్, సారా టెండూల్కర్‌లకు చెందిన రెండు ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్నాయి. అయితే వాళ్లకు అసలు ట్విట్టర్ అకౌంట్లే లేవని, వాటిని ఫాలో కావద్దని సచిన్ ట్విట్టర్‌లో తన అభిమానులను కోరాడు. అటు ట్విట్టర్‌కు కూడా ఫేక్ అకౌంట్లు తొలగించాలని రిక్వెస్ట్ చేశాడు.


సచిన్ కోరిక మేరకు ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ ట్విట్టర్ అకౌంట్ అయితే డిలిట్ అయిపోయిందిగానీ.. సారాది మాత్రం కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆమె ఫేక్ అకౌంట్‌కు 1105 మంది ఫాలోవర్లు ఉన్నారు.

2923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles