భారత్ జోరు.. టీ20 సిరీస్ మనదే

Mon,September 24, 2018 06:40 PM

Patil, Rodrigues Help India Women Clinch T20I Series in Sri Lanka

కొలంబో: భారత మహిళల జట్టు వరుస విజయాల పరంపర కొనసాగుతోంది. వన్డే సిరీస్ విజయంతో మంచి ఊపుమీదున్న టీమ్‌ఇండియా అదే జోష్‌లో టీ20 సిరీస్‌నూ కైవసం చేసుకుంది. సోమవారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు.

అనుజ పటేల్ ఆల్‌రౌండ్ షో, జెమీమా రోడ్రిగ్స్(52 నాటౌట్) అర్ధశతకంతో చెలరేగడంతో భారత్‌కు ఎదురే లేకుండా పోయింది. తొలుత బంతితో లంకను కుప్పకూల్చిన అనుజ(3/36).. ఆ తరువాత లక్ష్య ఛేదనలో బ్యాట్(54 నాటౌట్)తో మెరుపులు మెరిపించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంక 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ తరువాత ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే స్మృతి మంధాన(5), మిథాలీ రాజ్(11) వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జెమీమాకు.. అనుజ సహకారం అందించడంతో భారత్ 15.4 ఓవర్లలో 3 కోల్పోయి అలవోకగా విజయం అందుకుంది.

4773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles