ఒక్క పరుగు తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం: వీడియో

Mon,April 22, 2019 09:23 AM

Parthiv Patel helps RCB win a thriller despite Mahendra Singh Dhonis 48-ball 84

బెంగ‌ళూరు: చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పోరులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం సాధించింది. ఐపీఎల్‌-12వ సీజ‌న్‌లో బెంగ‌ళూరుకు ఇది వ‌రుస‌గా రెండో విజ‌యం కాగా మొత్తంగా మూడోది కావ‌డం విశేషం. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేసిన చెన్నై సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోనీ (48 బంతుల్లో 84; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) పోరాటం వృథా అయింది.

ఒక బంతికి 2 పరుగులు చేస్తే చాలు.

చెన్నై నెగ్గాలంటే చివరి ఓవర్‌లో 26 పరుగులు కావాల్సి ఉండగా.. కోహ్లీ ఉమేశ్ యాదవ్‌కు బంతి అప్పగించాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనీ రెండో బంతిని స్టేడియం బయటకు పంపాడు. మూడో బంతిని అద్భుతం అనే రీతిలో సిక్సర్‌గా మలిచాడు. నాలుగో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఐదో బంతికి మరో సిక్సర్ బాదిన మహీ.. గెలుపు కోసం ఒక బంతికి 2 పరుగులు చేయాల్సి వ‌చ్చింది. కానీ చివరి బంతిని ధోనీ బాదలేకపోయాడు. నాన్‌స్ట్రయికింగ్ నుంచి పరుగందుకున్న చహర్ క్రీజులోకి చేరేలోపే పార్థివ్ వికెట్లను గిరాటేశాడు. దీంతో బెంగళూరు సంబురాల్లో మునిగిపోయింది. రసవత్తరంగా జరిగిన మ్యాచ్ హైలెట్స్ చూడండి.

3450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles