రాజస్థాన్‌ కథ ముగిసే..

Sat,May 4, 2019 07:34 PM

Pants Fifty Takes Delhi to Five-wicket Win

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-12 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కథ ముగిసింది. ఇతర సమీకరణాల ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ముందు వరకు ప్లేఆఫ్స్‌ అశలు సజీవంగా ఉంచుకుంది. కానీ, రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దీంతో ప్రస్తుత సీజన్‌ నుంచి రాజస్థాన్‌ నిష్క్రమించింది. ఢిల్లీ జట్టు ఆల్‌రౌండ్‌ షో ప్రదర్శనతో రాజస్థాన్‌ ఆశలను ఆవిరి చేసింది. లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ ఆడిన ఢిల్లీ 19 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. అలాగే రాజస్థాన్‌ 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 11 పాయింట్లతో ఆరోస్థానం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 16.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యువ సంచలనం రిషబ్‌ పంత్‌(53 నాటౌట్‌: 38 బంతుల్లో 2ఫోర్లు, 5సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ అలవోకగా విజయం సాధించింది.

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ఆఖర్లో యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌(50: 49 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) ఒత్తిడిలోనూ అర్ధశతకంతో చెలరేగి ఆడటంతో రాజస్థాన్‌ ఆమాత్రం స్కోరైనా చేసింది. రహానె(2), లివింగ్‌స్టోన్‌(14), సంజు శాంసన్‌(5), మహిపాల్‌ లామ్రోర్‌(8), శ్రేయాస్‌ గోపాల్‌(12), బిన్నీ(0) ఘోరంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ(3:38), అమిత్‌ మిశ్రా(3/17), ట్రెంట్‌ బౌల్ట్‌(2/27) గొప్పంగా బౌలింగ్‌ చేసి రాజస్థాన్‌ను కట్టడి చేశారు. బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ కోలుకోకుండా వరుస విరామాల్లో దెబ్బకొట్టారు.

3728
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles