ఇంగ్లాండ్‌లో సెంచరీ చేసిన భారత తొలి వికెట్ కీపర్ పంతే

Wed,September 12, 2018 11:29 AM

Pant Becomes First Indian Wicket keeper to Score Ton in England

లండన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో ఆఖరిదైన ఐదో టెస్టులో యువ కెరటం రిషబ్ పంత్(146 బంతుల్లో 114, 15ఫోర్లు, 4సిక్స్‌లు) ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర ఒత్తిడిలో కీలక సమయంలో విదేశీ గడ్డపై ఆఖరి వరకు పోరాడి చిరస్మరణీయ సెంచరీ చేయడంపై మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ కొనియాడారు.

ఈ టెస్టులో పంత్ సాధించిన రికార్డులివే..

*ఇంగ్లాండ్‌లో సెంచరీ చేసిన భారత తొలి వికెట్ కీపర్ పంతే. అతన ధోనీ(92)ని అధిగమించాడు.
*పంత్ తనకు అలవాటైన శైలిలో రెచ్చిపోయాడు. ఆతిథ పేసర్లపై ఎదురుదాడికి దిగి రాహుల్‌కు దీటుగా పరుగులు చేశాడు.
*భారత్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన(20ఏళ్ల 342 రోజులు) వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు నమోదు చేశాడు. మొదటి స్థానంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా (20ఏళ్ల 150రోజులు) ఉన్నాడు. అతను వెస్టిండీస్ మీద సెంచరీ బాదాడు.
*టెస్టు మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో శతకం చేసిన మొదటి భారత వికెట్ కీపర్ రిషబ్ పంతే. ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్‌లో ఏడోవాడు కావడం విశేషం.
*సిక్సర్‌తో సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్ పంత్. గతంలో కపిల్ దేవ్, హర్భజన్‌స ఇంగ్, ఇర్ఫాన్ పఠాన్, ఈ ఘనత సాధించారు.
*టెస్టు క్రికెట్లో పరుగుల ఖాతాను సిక్సర్‌తోనే ఆరంభించడం విశేషం.

2759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles