వరల్డ్‌కప్ సెమీస్‌‌..కష్టాల్లో భారత్‌

Wed,July 10, 2019 06:15 PM

Pandya Departs, Dhoni Key For India

మాంచెస్ట‌ర్: ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫేవ‌రెట్‌గా బ‌రిలో దిగిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడ్డది. ఫైన‌ల్ చేరే అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి. తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాపార్డర్‌ టపటప కూలడంతో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అనంతరం పాండ్య, పంత్‌లు కాస్త నిలదొక్కకున్నా ఇద్దరూ 32 పరుగుల వద్ద పెవిలియన్‌ దారి పట్టడంతో భారత్‌ ఫైనల్‌ ఆశలు ఆవిరియ్యాయి. ప్రస్తుతం ఆశలన్నీ ధోనీ, జడేజా పైనే ఉన్నాయి. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ అప్పడప్పుడూ ఒకటి రెండు బౌండరీలు కొడితే టార్గెట్‌ను చేరుకునే అవకాశాలున్నాయి.

240 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన భార‌త్‌కు కివీస్ బౌల‌ర్లు క‌ల‌లో కూడా ఊహించ‌ని షాకిచ్చారు. లోకేశ్ రాహుల్‌(1), రోహిత్ శ‌ర్మ‌(1), విరాట్ కోహ్లీ(1) అనూహ్యంగా వెనుదిర‌గ‌డంతో 5/3తో ఇబ్బందుల్లో ప‌డింది. పిచ్ బౌల‌ర్లు స‌హ‌కరిస్తుండ‌టంతో కివీస్ పేస‌ర్లు రెచ్చిపోతున్నారు. ఈ క్ర‌మంలో రిష‌బ్ పంత్‌(32), హార్దిక్ పాండ్య(32) ఇన్నింగ్స్ నిర్మించే ప్ర‌య‌త్నం చేసినా ఎక్కువ సేపు నిలువ‌లేదు. 35 ఓవ‌ర్లు ముగిసేస‌రికి భార‌త్ 6 వికెట్ల‌కు 119 ప‌రుగులు చేసింది. భార‌త్ విజ‌యానికి ఇంకా 90 బంతుల్లో 121 ప‌రుగులు చేయాలి. ప్ర‌స్తుతం ధోనీ(20), ర‌వీంద్ర‌ జ‌డేజా(15) క్రీజులో ఉన్నారు. వీరిద్ద‌రూ వికెట్ కాపాడుకుంటూ సింగిల్స్ తీస్తూ స్కోరును ముందుండి న‌డిపిస్తున్నారు.1457
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles