తొలి వికెట్ కోల్పోయిన పాక్..

Sun,June 16, 2019 08:35 PM

pakisthan lost their first wicket in world cup match against india

లండన్: భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో 337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇమామ్ ఉల్ హక్ విజయ్ శంకర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 5వ ఓవర్‌లో 4 బంతులు వేసిన భువనేశ్వర్ గాయం కారణంగా వెనుదిరగగా మిగిలిన 2 బంతులను వేసేందుకు వచ్చిన విజయ్ శంకర్ తన తొలి బంతికే వికెట్ తీయడం విశేషం. కాగా పాక్ బ్యాట్స్‌మెన్లలో బాబర్ ఆజం (6 పరుగులు), ఫకర్ జమాన్ (11 పరుగులు)లు క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు 6.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 25 పరుగులుగా ఉంది.

726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles