తొలి వికెట్ కోల్పోయిన పాక్

Sat,February 27, 2016 07:06 PM

Pakistan lost first wicket in T20

మీర్పూర్ : భారత్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. నెహ్రా వేసిన తొలి ఓవర్ లోనే హఫీజ్ వెనుదిరిగాడు. తొలి ఓవర్ నుంచే ఇండో - పాక్ మ్యాచ్ హీటెక్కింది.

ఆసియా కప్ టీ20 టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మీర్పూర్‌లోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో తలపడేందుకు ఇరు జట్లు హోరాహోరీగా ప్రిపేరయ్యాయి. పాకిస్థాన్ పేస్ బౌలింగ్‌ను అటాక్ చేసేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది. టీమిండియా ఈ మ్యాచ్‌కు ఓ మార్పు చేసింది. శిఖర్ ధావన్ స్థానంలో అజింక రహానే జట్టులోకి వచ్చాడు. తొలి అయిదు ఓవర్లలో ప్రత్యర్థిపై పట్టుబిగిస్తామని ధోనీ అన్నాడు. మ్యాచ్‌పై వత్తిడి ఉన్నట్లు ధోనీ అంగీకరించాడు. భారత్‌ను ఢీకొనేందుకు పాకిస్థాన్ నలుగురు స్పీడ్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. తాను వత్తిడి తీసుకోవడం లేదని అఫ్రిది అన్నాడు. సరైన బౌలింగ్‌తో భారత్‌ను అటాక్ చేస్తామని అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు.

1361
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles