సారీ.. మేం కేక్ కట్ చేయాల్సింది కాదు!

Tue,June 5, 2018 02:24 PM

Pakistan Former pacer Waqar Younis says Sorry to fans for cutting cake on Wasim Akrams Birth day

హెడ్లింగ్లీ: పవిత్ర రంజాన్ మాసంలో కేక్ కట్ చేసినందుకు నన్ను క్షమించండి అంటూ ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ వ‌కార్ యూనిస్‌. ఇంగ్లండ్, పాకిస్థాన్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ ఇస్తున్న వకార్.. మరో మాజీ పేస్ బౌలర్ వసీమ్ అక్రమ్ బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేశాడు. ఆ సమయంలో అతని పక్కనే పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రజాతోపాటు వసీం అక్రమ్ కూడా ఉన్నాడు. దీనిపై వకార్ స్పందిస్తూ రంజాన్ మాసంలో ఇలా కేక్ కట్ చేసినందుకు సారీ.. ఉపవాసం ఉంటున్న అందరికీ క్షమాపణ చెబుతున్నా. మేం అలా చేయాల్సింది కాదు అని వకార్ ట్వీట్ చేశాడు.


కేక్ కట్ చేసిన తర్వాత వసీమ్‌తోపాటు వకార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రంజాన్ మాసంలో ఇలా కేక్ చేసి తింటారా అంటూ అభిమానులు వాళ్లపై ఫైర్ అయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్‌ను ఇన్నింగ్స్ 55 పరుగులు తేడాతో ఓడించిన ఇంగ్లండ్.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

2862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles