విరాట్ మెసేజ్‌కు పాక్ ఫ్యాన్స్ ఫిదా

Sun,September 10, 2017 12:53 PM

Pakistan fans thrilled by Virat Kohlis Teachers Day Message

న్యూఢిల్లీ: ఒక్క మెసేజ్ ఇటు ఇండియ‌న్ ఫ్యాన్స్‌లో తీవ్ర అసంతృప్తి నింప‌గా.. అటు పాక్ ఫ్యాన్స్‌ను మాత్రం తెగ సంతోషానికి గురిచేసింది. ఆ మెసేజ్ చేసింది ఎవ‌రో కాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా విరాట్ ఓ ఫొటోను పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఫొటోలో త‌న‌ను ఇన్‌స్పైర్ చేసిన క్రికెట‌ర్లంద‌రి పేర్లు ఉన్నాయి. అయితే అందులో అనిల్ కుంబ్లే పేరు లేక‌పోవ‌డంపై ఇండియ‌న్ ఫ్యాన్స్ సీరియ‌స్ అయ్యారు. ఎంత విభేదాలు ఉంటే మాత్రం అంత లెజెండ్‌ను పేరును ప‌క్క‌న పెట్టేస్తావా అని కోహ్లిపై చాలా మంది విరుచుకుప‌డ్డారు. మ‌రి ఇందులో పాక్ అభిమానుల‌ను సంతోష పెట్టిన అంశం ఏంటి అంటారా? అందులో కుంబ్లే పేరు లేక‌పోయినా.. పాక్ ప్లేయ‌ర్స్ ఇమ్రాన్‌ఖాన్‌, జావెద్ మియందాద్‌, ఇంజ‌మాముల్ హ‌క్ పేర్లు ఉన్నాయి. దీంతో వాళ్లు ఆ మెసేజ్ చూసి ఫిదా అయిపోయారు. ఇన్నాళ్లూ విరాట్ ఆట‌కే ఫ్యాన్స్‌గా ఉన్న వాళ్లు.. ఇప్పుడు అత‌ని వ్య‌క్తిత్వాన్ని కూడా మెచ్చుకోలేకుండా ఉండ‌లేక‌పోతున్నారు. ట్విట్ట‌ర్‌లో విరాట్‌ను పొగుడుతూ మెసేజ్‌లు పోస్ట్ చేశారు.
3369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles