క్రికెట్ స్నేహం.. భారత అభిమానికి పాకిస్థాన్ అభిమాని సాయం!

Wed,September 19, 2018 02:59 PM

Pakistan Fan Mohammad Bashir helped Indian fan Sudhir Gautham for Asia Cup trip

దుబాయ్: ఇండియా, పాకిస్థాన్ మధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా.. క్రికెట్ రెండు దేశాల అభిమానులను దగ్గర చేస్తుంది. గతంలోనూ చాలాసార్లు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో క్రికెట్ సిరీస్‌లు వాటిని తగ్గించే ప్రయత్నం చేశాయి. తాజాగా మరోసారి ఏషియాకప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఓ పాక్ అభిమాని చేసిన పని రెండు దేశాల ప్రజలను ఆకట్టుకుంటున్నది. టీమిండియా హార్డ్‌కోర్ ఫ్యాన్ సుధీర్ గౌతమ్ ఏషియాకప్ మ్యాచ్‌లు చూడటానికి పాక్ అభిమాని మొహమ్మద్ బషీర్ సాయపడ్డాడు. ఇండియన్ టీమ్ ఆడే ప్రతి మ్యాచ్‌లో ఒంటికి త్రివర్ణ పతాకంలోని రంగులను వేసుకొని వచ్చే అభిమాని మీకు తెలిసే ఉంటాడు. సచిన్‌కు వీరాభిమాని అయిన సుధీర్.. అతడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మిస్ టు టెండూల్కర్ అని ఒంటిపై రాసుకొని మ్యాచ్‌లకు వస్తున్నాడు.


అయితే ఈసారి యూఏఈ వెళ్లి ఏషియాకప్ చూడటానికి డబ్బులు లేకపోవడంతో సుధీర్ టోర్నీకి వెళ్లకూడదని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న పాక్ హార్డ్‌కోర్ ఫ్యాన్ మొహమ్మద్ బషీర్ అలియాస్ చాచా షికాగో.. సుధీర్ టూర్‌కి అయ్యే ఖర్చులన్నీ భరిస్తానని చెప్పాడు. నువ్వు ఇక్కడికి వచ్చేసెయ్.. అన్నీ నేను చూసుకుంటాను. నేను అంత గొప్పవాన్ని కాకపోయినా.. నా మనసు మాత్రం సముద్రమంత పెద్దది. నీకు సాయం చేస్తే అల్లా సంతోషిస్తాడు అని సుధీర్‌తో తాను చెప్పినట్లు చాచా షికాగో చెప్పాడు. గతంలోనూ ఈ ఇద్దరు అభిమానులు కొన్ని మ్యాచుల్లో కలిశారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్‌ను కూడా ఈ ఇద్దరూ కలిసి చూడనున్నారు.

1179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS