ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్

Wed,June 14, 2017 09:47 PM

Pakistan defeats England to enter the final of Champions trophy

కార్డిఫ్ : ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఫైనల్‌లోకి చేరింది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను పాక్ బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్‌ను 49.5 ఓవర్లలో 211 పరుగులకే పరిమితం చేసింది. పాకిస్థాన్ 37.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి విజయాన్ని ముద్దాడింది. మొత్తానికి పాకిస్థాన్ బౌలర్లు హడలెత్తించారు. కట్టుదిట్టమైన పాక్ బౌలింగ్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ జోరుగా రన్స్ చేయలేకపోయారు. పాక్ బ్యాట్స్‌మెన్స్ అజహర్ అలీ 76(5 ఫోర్లు, ఒక సిక్స్), ఫఖ్హర్ జమన్ 57(7 ఫోర్లు, ఒక సిక్స్), బాబర్ అజమ్ 38(నాటౌట్), మహ్మద్ హఫీజ్ 31(నాటౌట్) పరుగులు చేశారు.

1880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles