పాకిస్థాన్ క్రికెట‌ర్‌తో ఆడుకున్న ఫ్యాన్స్‌!

Mon,July 17, 2017 11:30 AM

Pakistan Cricketer Umar Akmal trolled by fans in Twitter

లండ‌న్‌: పాకిస్థాన్ క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌ను ఓ ఆటాడుకున్నారు అక్క‌డి ఫ్యాన్స్‌. గ‌త కొంత కాలంగా ఫామ్ కోసం తంటాలు ప‌డుతూ టీమ్‌లో స్థానం కోల్పోయిన అక్మ‌ల్‌.. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్నాడు. టీమ్‌లో ప్లేసే కాదు.. ఈ మ‌ధ్య పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రిలీజ్ చేసిన నేష‌న‌ల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లోనూ ఉమ‌ర్ అక్మ‌ల్ పేరు లేదు. ఇలాంటి సంద‌ర్భంలో ఓ కాస్ట్‌లీ బెంట్లీ కారు ప‌క్క‌న నిల‌బ‌డి ఫొటో దిగిన ఉమ‌ర్ అక్మ‌ల్.. దానిని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. హార్డ్‌వ‌ర్క్ చేసిన తర్వాత లండ‌న్‌లో ఎంజాయ్ చేస్తున్నా అని కామెంట్ పెట్టాడు.


కానీ అక్మ‌ల్ అనుకున్న‌ది ఒక‌టి.. జరిగింది మ‌రొక‌టి. ట్విట్ట‌ర్‌లో ఫ్యాన్స్ సీరియ‌స్‌గా రియాక్ట‌య్యారు. అస‌లు ఏం హార్డ్‌వ‌ర్క్ చేశావ‌ని ఎంజాయ్ చేయ‌డానికి అని ఒక‌రంటే.. అంత కాస్ట్‌లీ కారు నీకెక్క‌డిది నిల‌దీశారు మ‌రొక‌రు.
అయితే ఫ్యాన్స్ తిట్ల‌కు కూడా ఉమ‌ర్ హుందాగా రియాక్ట‌య్యాడు. నెగ‌టివ్ కామెంట్స్ వ‌ద్దు.. మీ ఆశీర్వాదాలు కావాల‌ని ట్వీట్ చేశాడు.

3992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS