న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌పై విరుచుకుపడిన పాక్ కెప్టెన్

Thu,November 8, 2018 03:32 PM

Pakistan captain Sarfaraz Ahmed not happy with Ross Taylors action

అబుదాబి: న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌పై విరుచుకుపడ్డాడు పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. అతని తీరేమీ బాగా లేదని మండిపడ్డాడు. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ బౌలర్ మహ్మద్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ టేలర్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. హఫీజ్ తొలి ఓవర్ ముగియగానే అతడు చకింగ్ చేస్తున్నాడంటూ టేలర్ ఫిర్యాదు చేయడం వీడియోల్లో కనిపించింది. దీంతో సర్ఫరాజ్ సీరియస్ అయ్యాడు. వెంటనే అంపైర్ల దగ్గరకు వెళ్లి తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.


టేలర్ తీరు ఏమాత్రం బాగా లేదు. బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు చేయడం అతని పని కాదు. ఇది దురదృష్టకరం. అతని పని బ్యాటింగ్ చేయడం. దానిపై దృష్టి సారిస్తే మంచిది. ఇదే విషయంపై నేను అంపైర్లకు ఫిర్యాదు చేశాను అని సర్ఫరాజ్ మ్యాచ్ తర్వాత చెప్పాడు. టేలర్ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్. అతను ఇలాంటి పని చేయాల్సింది కాదు. అతడు రెండు, మూడుసార్లు ఇలాగే చేశాడు. అది అంపైర్ల పని. హఫీజ్ యాక్షన్‌లో ఎలాంటి లోపం లేదు. అనవసరంగా టేలర్ దాన్నో రాద్ధాంతం చేయాలని చూశాడు అని సర్ఫరాజ్ మండిపడ్డాడు. నిజానికి హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై కొన్నేళ్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఐసీసీ ఇప్పటికే అతని బౌలింగ్‌పై మూడుసార్లు నిషేధం విధించింది.

3172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles