చెల‌రేగిన‌ భారత బౌలర్లు.. పాక్ 162 ఆలౌట్

Wed,September 19, 2018 08:15 PM

Pakistan all out for 163, Bhuvaneshwar gets 3 wickets

దుబాయ్: రోహిత్ శర్మ టీమ్ రఫాడించింది. ఆసియాకప్ తొలి వన్డేలో హాంగ్‌కాంగ్‌పై తడబడిన బౌలర్లు.. ఇవాళ పాకిస్థాన్‌పై మాత్రం ప్రభావం చూపించారు. ఇండియన్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కేవలం 43.1 ఓవర్లలో కేవలం 162 రన్స్ మాత్రమే చేసింది. పాక్ టీమ్‌లో అత్యధికంగా బాబర్ 47, మాలిక్ 43 రన్స్ చేశారు. భారత బౌలర్లు భువనేశ్వర్, కేదార్ జాదవ్‌లు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఆరంభంలో ఓపెనర్ల వికెట్లు తీసిన భువనేశ్వర్ పాక్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బాబర్, మాలిక్‌లు కొంత నిలకడగా ఆడారు. అయితే ఆ ఇద్దరి భాగస్వామ్యానికి బ్రేక్ పడిన తర్వాత ఇక పాక్ కోలుకోలేదు. భారీ స్కోర్ సాధిస్తుందని ఆశించిన పాక్.. తక్కువ స్కోర్‌కే చేతులెత్తేసింది. ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా గాయపడ్డా.. అతని స్థానంలో వచ్చిన మనీష్ పాండే ఓ సూపర్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు తీసుకోగా, కుల్దీప్ ఓ వికెట్ తీసుకున్నాడు. 163 ర‌న్స్ టార్గెట్‌తో భార‌త్ మ‌రికాసేప‌ట్లో బ్యాటింగ్ ప్రారంభించ‌నుంది.3490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS