రాజస్థాన్ రాయల్స్ ప్ర‌ధాన కోచ్‌గా మళ్లీ ప్యాడీ ఆప్టన్!

Mon,January 14, 2019 09:19 AM

Paddy Upton appointed Rajasthan Royals head coach

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 సీజన్ కోసం ఆయా ఫ్రాంఛైజీలు సన్నాహాలను వేగవంతం చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా ప్యాడీ ఆప్టన్‌ను నియమించుకుంది. 2013లో ఆప్టన్‌లో ఆ టీమ్ కోచ్‌గా ఉన్నప్పుడు రాజస్థాన్ సెమీఫైనల్ చేరింది. ప్యాడీ ఇప్పటి వరకు అంతర్జాతీయంగా పలు టీ20 లీగ్‌లకు కోచ్‌గా వ్యవహరించాడు. 2013 నుంచి 2015 ఐపీఎల్ సీజన్ వరకూ రాజస్థాన్ ప్ర‌ధాన కోచ్‌గా పనిచేశారు. తాను బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే జట్టుని ప్లేఆఫ్ చేర్చాడు. ఆప్టన్ మార్గదర్శకత్వంలోనే సిడ్నీ థండర్స్ 2016 బిగ్‌బాష్ టైటిల్ నెగ్గింది.

టీమిండియా వన్డే ప్రపంచకప్(2011) గెలిచిన సమయంలో భారత జట్టుకు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా ఉన్నారు. మెగా టైటిల్ సొంతం చేసుకోవడంలో అప్పటి ప్రధాన కోచ్ కిర్‌స్టెన్‌తో కలిసి భారత్‌కు సేవలందించాడు. ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా స్టెఫాన్ జోన్స్.. బ్యాటింగ్ కోచ్‌గా అమోల్ ముజుందార్.. సాయిరాజ్ బహుతులే స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఆప్టన్‌తో కలిసి రాజస్థాన్ జట్టుకు కోచింగ్ ఇవ్వనున్నారు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభంకానుంది.

1579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles