కోచ్ ప‌ద‌విపై గంగూలీ మాట ఇదీ..

Mon,June 26, 2017 11:01 AM

One who can win cricket matches says Ganguly on new Coach

ముంబై: అనిల్ కుంబ్లే రాజీనామాతో ఇప్పుడు టీమిండియా కొత్త కోచ్ ఎవ‌ర‌న్న‌దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతున్న‌ది. శ్రీలంక టూర్‌లోపు కోచ్ ఎంపిక పూర్త‌వుతుంద‌ని చెప్పిన బీసీసీఐ.. దీనికోసం కొత్తగా మ‌రోసారి ద‌ర‌ఖాస్తుల‌ను కూడా ఆహ్వానించింది. అయితే కోచ్ ఎంపిక బాధ్య‌త తీసుకున్న క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ (సీఏసీ)లో స‌భ్యుడైన సౌర‌వ్ గంగూలీ.. దీనిపై తొలిసారి స్పందించాడు. ముఖ్యంగా కోహ్లి, కుంబ్లే విభేదాలు.. గంగూలీకి అస్స‌లు ఇష్టంలేని ర‌విశాస్త్రిని కోచ్‌గా విరాట్ కోరుకుంటున్న నేప‌థ్యంలో అత‌ని స్పంద‌న కోసం చాలా మంది ఎదురుచూశారు. ఆదివారం బీసీసీఐ.. స్టేట్ అసోసియేష‌న్స్‌తో నిర్వ‌హించిన మీటింగ్‌కు గంగూలీ హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా కోచ్‌గా ఎవ‌రిని చేస్తారు అని మీడియా ప్ర‌శ్నించ‌గా.. ఎవ‌రు మ్యాచ్‌ల‌ను గెలిపిస్తారో వాళ్ల‌నే కోచ్‌ను చేస్తామ‌ని సింపుల్‌గా చెప్పేశాడు.

త‌మ మొద‌టి ప్రాధాన్యం దీనికే అని అత‌ను స్ప‌ష్టంగా చెప్పాడు. ఇక రెండో క్రైటీరియా ఏంటో తెలుసా? కెప్టెనే బాస్‌గా ఉండేలా.. విరాట్ కోహ్లితో క‌లిసిపోయే వ్య‌క్తి కావాల‌ట‌. అంటే ప‌రోక్షంగా ర‌విశాస్త్రికి గంగూలీ ఓకే చెబుతున్నాడా అన్న అనుమానం క‌లుగుతున్న‌ది. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందిగా రవిశాస్త్రిని బీసీసీఐ కోరిన విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఇష్టం ఉన్నా లేక‌పోయినా.. బోర్డు ఒత్తిడి మేర‌కు ర‌విశాస్త్రిని అంగీక‌రించాల్సిన ప‌రిస్థితి గంగూలీకి త‌లెత్తుతుందా అన్న సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. కోచ్ ఎంపిక‌లో సీఏసీ.. బోర్డు సూచ‌న‌ల‌ను పాటిస్తుంద‌ని గంగూలీ అన్నాడు.

1318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles