డీఆర్‌ఎస్‌ కోరి బతికిపోయిన నికోల్స్‌

Sun,July 14, 2019 03:42 PM

NZ opener Nicholls successfully overturns lbw decisi

లండన్‌: లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ నిలకడగా ఆడుతోంది. పిచ్‌ ఆరంభంలో పేసర్లకు సహకరిస్తుండటంతో ఇంగ్లాండ్‌ పేసర్లు విజృంభిస్తున్నారు. న్యూజిలాండ్‌ ఓపెనర్లు ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నారు. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైవిధ్యమైన బంతులతో విరుచుకుపడుతున్న ఇంగ్లీష్‌ బౌలర్లు ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ ధాటిగా ఎదుర్కొంటున్నాడు. క్రిస్‌వోక్స్‌ వేసిన తొలి ఓవర్‌లో కేవలం మూడు పరుగులే రాబట్టిన కివీస్‌.. జోఫ్రా ఆర్చర్‌ వేసిన తర్వాతి ఓవర్లో కేవలం 3 రన్స్‌ సాధించారు. వోక్స్‌ మూడో ఓవర్లలోనే కేవలం 2 పరుగులే వచ్చాయి. నాలుగో ఓవర్‌ వేసిన ఆర్చర్‌ బౌలింగ్‌లో విధ్వంసకర ఓపెనర్‌ గప్తిల్‌ ఒక సిక్స్‌, ఫోర్‌ బాది 12 రన్స్‌ రాబట్టి ఒత్తిడిని దూరం చేశాడు.

వోక్స్ వేసిన మూడో ఓవ‌ర్లో నికోల్స్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2.3వ బంతికి అతడిని అంపైర్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. దీంతో నికోల్స్ అంపైర్ నిర్ణ‌యంపై సమీక్ష కోరాడు. అందులో బంతి వికెట్లను తగలడం లేదని తేలడంతో కివీస్ ఊపిర‌పీల్చుకుంది. 6 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. గప్తిల్‌(19), నికోల్స్‌(7) నిదానంగా ఆడుతున్నారు.1033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles