భార‌త్ టాస్ ఓడ‌టం మంచికేనా..!

Sun,June 16, 2019 03:14 PM

Numbers Behind Indias Imposing 6-0 Record Against Pakistan in World Cups

మాంచెస్ట‌ర్: క్రికెట్ ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూసిన స‌మ‌రం ఆరంభ‌మైంది. ఉత్కంఠ‌భ‌రిత పోరులో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. వార‌మంతా ఇంగ్లాండ్‌లో వ‌ర్షాలు ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. భార‌త్‌, పాక్ మ్యాచ్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌ పిచ్‌పై ప‌చ్చిక కూడా లేదు. వ‌ర్ష ప్ర‌భావం నేప‌థ్యంలో ఆరంభంలో ఫాస్ట్‌బౌల‌ర్ల‌ను ఎదుర్కోవ‌డం బ్యాట్స్‌మెన్‌కు కొంచెం క‌ష్టంగా ఉంటుంది. ఐతే రికార్డు ప‌రిశీలిస్తే ఛేద‌న‌లో పాక్ ఎక్కువ‌సార్లు త‌డ‌బ‌డుతున్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. మెగా టోర్నీలో టీమిండియా చేతిలో ఓడిన ఆరు మ్యాచ్‌ల్లో(2003 మిన‌హా) ఐదు సార్లు పాక్ సెకండ్ బ్యాటింగ్ చేసింది. ఈ నేప‌థ్యంలో పాక్‌కు భారీ ల‌క్ష్యం నిర్దేశిస్తే..ఒత్తిడిలో పాక్‌ను దెబ్బ‌కొట్టే అవకాశం కోహ్లీసేన ముందుంది.

2796
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles