వింబుల్డన్ సెమీస్‌లో జకోవిచ్..

Wed,July 11, 2018 09:02 PM

  Novak Djokovic defeats Kei Nishikori to reach first semi-final since 2015

లండన్: వింబుల్డన్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారుడు నిషికోరిపై 6-3, 3-6, 6-2, 6-2 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. దీంతో అతడు రెండేళ్ల తరువాత వింబుల్డన్ సెమీఫైనల్ చేరాడు. తొలి సెట్‌ను కైవసం చేసుకున్న జకోవిచ్ ప్రత్యర్థి నుంచి అనూహ్య రీతిలో పోటీ ఎదురవడంతో రెండో సెట్ కోల్పోయాడు. తరువాత పుంజుకున్న నొవాక్ తన మునుపటి ఆటను ప్రదర్శించాడు. వరుసగా మూడు, నాలుగు సెట్లను కైవసం చేసుకొని సెమీస్‌కు దూసుకెళ్లాడు.

374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS